నేడు జో బైడెన్ ప్ర‌మాణ స్వీకారం.. అతిథుల కోసం చ‌వులూరించే వంట‌కాలు సిద్ధం

20-01-2021 Wed 09:29
  • విందు మెనూలో పలు శాకాహార, మాంసాహార వంటకాలు
  • సిద్ధం చేసిన‌ చెఫ్‌ రాబర్ట్‌ డోర్సీ
  • కమలా హారిస్ బాగా ఇష్టప‌డే   సీఫుడ్‌ గంబో సూప్ సిద్ధం
  • వంట‌కాల్లో పాంకో క్రస్టెడ్‌ క్రాబ్‌ కేక్స్‌, ఆర్గానిక్‌ కోస్టల్‌ గ్రీన్స్  
joe biden takes oath as president today dinner menu ready

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా క‌మ‌లా హారిస్ నేడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చే అతిథుల కోసం చ‌వులూరించే  వంటకాలను సిద్ధం చేశారు. విందు మెనూలో పలు శాకాహార, మాంసాహార వంటకాలు ఉన్నాయి.  

ప్రముఖ చెఫ్‌ రాబర్ట్‌ డోర్సీ ఆధ్వ‌ర్యంలో ఈ వంట‌లు చేశారు. కమలా హారిస్ బాగా ఇష్టప‌డే సీఫుడ్‌ గంబో సూప్‌ కూడా అతిథుల‌కు వ‌డ్డించ‌నున్నారు. షెల్‌ ఫిష్‌, కాప్సికం, ఉల్లిపాయల‌తో దీన్ని చేస్తారు. అతిథుల‌కు వ‌డ్డించే వంట‌కాల్లో పాంకో క్రస్టెడ్‌ క్రాబ్‌ కేక్స్‌, ఆర్గానిక్‌ కోస్టల్‌ గ్రీన్స్ లు కూడా ఉన్నాయి.

వైట్‌ రైస్‌, లూసియానా లవ్‌, డీప్ అంబర్‌ రౌక్స్‌, స్వీట్‌ పెప్పర్స్‌, బ్లాకెన్‌డ్‌ చికెన్ వంటివి కూడా మెనూలో ఉన్నాయి. అలాగే, బనానా రైసిన్‌ బ్రెడ్‌ పుడ్డింగ్‌, బౌర్‌బోన్‌ కారమెల్ స్వీట్ల‌ను కూడా అతిథులకు వడ్డిస్తారు.