పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

20-01-2021 Wed 08:29
  • జల్పాయ్‌గురి జిల్లాలోని ధూప్‌గురిలో ఘటన
  • తీవ్రంగా గాయపడిన మరో 18 మంది
  • పొగమంచు కారణంగానే ప్రమాదం
13 people died in an accident in Dhupguri west Bengal

పశ్చిమ బెంగాల్‌లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్పాయ్‌గురి జిల్లాలోని ధూప్‌గురిలో జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

రాళ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు.. ఆటో, కారును ఢీకొట్టింది. ప్రమాదంలో మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలను రోడ్డు పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.