సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

20-01-2021 Wed 07:21
  • 'రాధే శ్యామ్' పూర్తి చేసిన పూజ హెగ్డే 
  • చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ అప్ డేట్
  • 23న అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు'  
Pooja Hegde completes her shooting part for Radhe Shyam

*  'రాధే శ్యామ్' చిత్రానికి సంబంధించి కథానాయిక పూజ హెగ్డే తన షూటింగు మొత్తాన్ని నిన్నటితో పూర్తిచేసింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా పూజ తెలియజేసింది. ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేస్తారు.
*  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రాన్ని చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంగా మలయాళ సినిమా 'లూసిఫర్'ను రీమేక్ చేయనున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగును ఈ నెల 21న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభిస్తారు.    
*  అల్లరి నరేశ్, పూజ ఝవేరి జంటగా గిరి పాలిక దర్శకత్వంలో రూపొందిన 'బంగారు బుల్లోడు' చిత్రాన్ని ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'బంగారు బుల్లోడు' సినిమాలోని 'స్వాతిలో ముత్యమంత..' అనే సూపర్ హిట్ సాంగును ఇందులో రీమేక్ చేశారు.