కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ మోసం.. ‘కేరింత’ హీరో విశ్వంత్‌పై కేసు నమోదు

20-01-2021 Wed 06:58
  • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • 2015లో దిల్ రాజు సినిమా ‘కేరింత’తో టాలీవుడ్‌లోకి
  • గతేడాది విడుదలైన ‘ఓ పిట్టకథ’లోనూ నటించిన విశ్వంత్
Cheating case against actor vishwanth in banjarahills police station

టాలీవుడ్ నటుడు విశ్వంత్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. అతి తక్కువ ధరకే కార్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసినట్టు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విశ్వంత్ పూర్తిపేరు విశ్వనాథ్. సామర్లకోటకు చెందిన విశ్వంత్.. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాడు. 2015లో దిల్‌రాజు నిర్మించిన ‘కేరింత’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. గతేడాది విడుదలైన ‘ఓ పిట్టకథ’ సినిమాలోనూ విశ్వంత్ నటించాడు.