పూజ హెగ్డేకు కోలీవుడ్ నుంచి భారీ ఆఫర్!

19-01-2021 Tue 17:39
  • తెలుగు, హిందీ సినిమాలతో పూజ హెగ్డే బిజీ
  • నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్
  • కథానాయికగా పూజ హెగ్డేకు అవకాశం
  • డేట్స్ విషయంలో ప్రస్తుతం సంప్రదింపులు  
Pooja Hegde to be cast opposite Vijay

నేటి టాలీవుడ్ హాట్ హీరోయిన్ పూజ హెగ్డే ఇటు తెలుగు సినిమాలు.. అటు హిందీ సినిమాలతో కెరీర్ని సక్సెస్ బాటలో లాగిస్తోంది. మంచి అవకాశాలు తెలుగులో వచ్చినా వదలడం లేదు.. బాలీవుడ్ లో వచ్చినా వదులుకోవడం లేదు. అందుకు తగ్గట్టుగా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ కొత్త సినిమాలు ఒప్పుకుంటోంది. తన లక్ష్యం బాలీవుడ్డే అయినా, తన కెరీర్ని నిలబెట్టిన టాలీవుడ్ ని మాత్రం ఈ చిన్నది వదలడం లేదు.

ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు తాజాగా మరో భారీ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాలో నటించే అవకాశం పూజకు వచ్చిందట. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తమిళంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ జరుగుతోంది. ఇందులో కథానాయిక పాత్రకు పూజ హెగ్డేను తీసుకున్నట్టు సమాచారం. డేట్స్ విషయంలో ప్రస్తుతం ఆమెతో చిత్రం యూనిట్ సంప్రదింపులు జరుపుతోందట. ఈ చిత్రం షూటింగును త్వరలోనే ప్రారంభిస్తారు.