నెక్ట్స్ జనరేషన్ బైకులు ఇలా ఉంటాయి... బీఎండబ్ల్యూ ఆర్18 కస్టమ్ బైకు ఇదిగో!

19-01-2021 Tue 16:39
  • స్పిరిట్ ఆఫ్ ప్యాషన్ పేరుతో కొత్త బైకు
  • ఆర్ 18 మోడల్ కు అదనపు హంగులు
  • కింగ్ స్టన్ కస్టమ్ సంస్థతో కలిసి బైకుకు సొబగులు
  • ధర వెల్లడి కాని వైనం
BMW Motorrad unveils mew custom made bike

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ తన మోటార్ సైకిళ్ల విభాగం బీఎండబ్ల్యూ మోటారాడ్ నుంచి స్పిరిట్ ఆఫ్ ప్యాషన్ పేరుతో కస్టమ్ మేడ్ బైక్ ను తీసుకువస్తోంది. జర్మనీకే చెందిన కింగ్ స్టన్ కస్టమ్ సంస్థతో కలిసి ఈ బైక్ కు అనేక సొగసులు అద్దింది. నెక్ట్స్ జనరేషన్ బైక్ అంటే ఇలాగే ఉంటుందని అనిపించేలా నగిషీలు దిద్దింది. ఒరిజినల్ ఆర్ 18 బైకుకు కొత్త పెయింటింగ్ తో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. హెడ్ లైట్లు, సైలెన్సర్, సస్పెన్షన్, సీటింగ్... ఇలా ఏది తీసుకున్నా ప్రత్యేకత కనిపిస్తుంది. ఓవరాల్ గా క్లాసిక్ ఆర్ట్ డెకో స్టయిల్లో ఈ బైకుకు కొత్తరూపం అందించారు. కాగా దీని ధరను బీఎండబ్ల్యూ మోటారాడ్ ప్రకటించాల్సి ఉంది.