పమిడిముక్కల పీఎస్ వద్ద ఉద్రిక్తత... దేవినేని ఉమను విడుదల చేయాలంటూ టీడీపీ శ్రేణుల ఆందోళన

19-01-2021 Tue 15:45
  • గొల్లపూడిలో ఉమను అరెస్ట్ చేసిన పోలీసులు
  • పమిడిముక్కల పోలీస్ స్టేషన్ కు తరలింపు
  • పోలీస్ స్టేషన్ కు తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
TDP Cadre demands the release of Devineni Uma

కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఉమ అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ క్రమంలో దేవినేని ఉమను ఉంచిన పమిడిముక్కల పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క, ఉమ అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా ఖండించారు. ప్రజల పక్షాన నిలిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.