జోధ్ పూర్ లో భారీ విన్యాసాలు నిర్వహించనున్న భారత్, ఫ్రాన్స్ వైమానిక దళాలు

19-01-2021 Tue 13:44
  • ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా విన్యాసాలు
  • ఈ నెల 20 నుంచి వాయుసేన విన్యాసాలు
  • ఐదు రోజుల పాటు సాగనున్న విన్యాసాలు
  • భారత్ తరఫున పాల్గొంటున్న రాఫెల్, సుఖోయ్, మిరేజ్
India and France set to conduct joint air force exercises

భారత్, ఫ్రాన్స్ వాయుసేనలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 20 నుంచి రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో భారత్, ఫ్రాన్స్ వైమానిక దళాలు భారీ ఎత్తున విన్యాసాలు నిర్వహిస్తాయి. 'ఎక్స్ డెజర్ట్ నైట్ 21' పేరిట నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకునే చర్యల్లో భాగంగా ఈ సంయుక్త విన్యాసాలు చేపడుతున్నారు.

ఈ విన్యాసాల్లో భారత్ తరఫున రాఫెల్, మిరేజ్-2000, సుఖోయ్-30ఎంకేఐ, ఐఎల్-78 ఫ్లయిట్ రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్, అవాక్స్, ఏఈడబ్ల్యూ అండ్ సీ విమానాలు పాల్గొంటాయి. ఫ్రాన్స్ వాయుసేన నుంచి రాఫెల్, ఎయిర్ బస్ ఏ-330 మల్టీరోల్ టాంకర్ ట్రాన్స్ పోర్ట్ (ఎంఆర్ టీటీ), ఏ-400ఎం టాక్టికల్ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొంటాయి.