తెలుగు రాష్ట్రాల్లో సోనూసూద్ అంబులెన్స్ సేవ‌లు ప్రారంభం

19-01-2021 Tue 13:13
  • ఇటీవ‌ల‌ కొన్ని వ్యాన్లను కొనుగోలు చేసిన సోనూసూద్
  • వాటిని అంబులెన్సులుగా మార్పించి సేవ‌లు
  • వైద్య సాయం కావాల్సిన పేద‌ల‌కు స‌ర్వీసు
sonu sood starts ambulance service

గ‌త ఏడాది కరోనా విజృంభ‌ణ‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పేదలకు సాయపడి అందరి మ‌న్న‌న‌లు పొందిన సినీనటుడు సోనూసూద్ అప్ప‌టి నుంచి త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఆయ‌న నుంచి సాయం పొందిన వారిలో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లలో చాలా మంది ఉన్నారు.  
           
ట్విట్టర్ వేదికగా సాయం కోరిన వారికి ఆయన అభయమిస్తూ పేద‌ల‌ కష్టాలను తీరుస్తున్న సోనూసూద్ ఇప్పుడు అంబులెన్సు స‌ర్వీసుల‌ను ప్రారంభించారు. ఇటీవ‌ల‌ కొన్ని వ్యాన్లను కొనుగోలు చేసిన సోనూసూద్‌ వాటిని అంబులెన్సులుగా మార్పించి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల కోసం వాటిని ప్రారంభించారు. వైద్య సాయం కావాల్సిన పేద‌ల‌కు ఈ సేవ‌లు అందుతాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ సమీపంలో ఈ అంబులెన్సులు సోనూసూద్ చేతుల మీదుగా ప్రారంభ‌మ‌య్యాయి.