ఫిలింఛాంబర్ లో దొరస్వామి రాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

19-01-2021 Tue 12:43
  • నిన్న దొర‌స్వామిరాజు మృతి
  • ఫిలిం ఛాంబ‌ర్ లో పార్ధివ దేహం
  • కాసేప‌ట్లో మ‌హా ప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు
raja mouli mourns demise of doraswamy

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వి.దొరస్వామి రాజు హైదరాబాదు, బంజారా హిల్స్‌లోని కేర్ ఆసుప‌త్రిలో నిన్న ఉదయం గుండెపోటుతో  మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న పార్ధివదేహాన్ని హైద‌రాబాద్, ఫిలిం ఛాంబ‌ర్ లో సంద‌ర్శ‌నార్ధం ఉంచారు.
     
సినీ ప్ర‌ముఖులు రాజ‌మౌళి, ముర‌ళీ మోహ‌న్ తో పాటు ప‌లువురు ఆయ‌న పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న అందించిన సేవ‌లను, ఆయ‌న‌తో త‌మ‌కు ఉన్న అనుబంధాన్ని సినీ ప్ర‌ముఖులు గుర్తు చేసుకున్నారు. కాసేప‌ట్లో మ‌హా ప్ర‌స్థానంలో దొర‌స్వామిరాజు అంత్య‌క్రియ‌లు జరు‌గుతాయి.