విజయానికి 61 ప‌రుగుల దూరంలో టీమిండియా

19-01-2021 Tue 12:27
  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 ప‌రుగులు
  • రెండో ఇన్నింగ్స్ లో 294 ప‌రుగులు
  • టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 336 ప‌రుగులు
  • రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా స్కోరు 88 ఓవ‌ర్లకు 267/5
India need 61 runs for win

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో టీమిండియా- ఆసీస్ మధ్య జరుగుతోన్న చివరి టెస్టు మ్యాచు చివ‌రిరోజు ఆట కొనసాగుతోంది. విజయానికి భార‌త్ 61 ప‌రుగుల దూరంలో ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369, రెండో ఇన్నింగ్స్ లో 294 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 336 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కొన‌సాగిస్తోంది.

రోహిత్ శ‌ర్మ 7, శుభ్‌మ‌న్ గిల్ 91, పుజారా 56, అజింక్యా ర‌హానె 24, మ‌యాంక్ అగ‌ర్వాల్ 9 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. ప్ర‌స్తుతం క్రీజులో రిష‌బ్ పంత్ 58, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 1 ప‌రుగుతో ఉన్నారు. భార‌త్ కు ఎక్స్‌ట్రాల రూపంలో 21 ప‌రుగులు వ‌చ్చాయి. టీమిండియా స్కోరు 88 ఓవ‌ర్ల నాటికి 267/5 గా ఉంది.