సినీన‌టుడు క‌మ‌ల‌హాస‌న్ కు స‌ర్జ‌రీ

19-01-2021 Tue 12:12
  • చెన్నైలోని శ్రీరామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ లో చికిత్స‌
  • బులెటిన్ విడుద‌ల చేసిన వైద్యులు
  • కుడి కాలు ఎముకకు స్వ‌ల్ప‌ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా స‌ర్జ‌రీ
 Kamal haasan goes under the knife

సినీన‌టుడు క‌మ‌ల‌హాస‌న్ కు చెన్నైలోని శ్రీరామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ లో వైద్యులు కాలికి శస్త్ర‌ చికిత్స చేశారు. ఈ నేప‌థ్యంలో ఆ ఆసుప‌త్రి క‌మ‌ల‌హాస‌న్ ఆరోగ్య ప‌రిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది.

కుడి కాలు ఎముకకు స్వ‌ల్ప‌ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా శ్రీరామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ లో క‌మ‌ల‌హాస‌న్ చేరార‌ని వైద్యులు వివ‌రించారు. ఆయ‌న‌కు స‌ర్జ‌రీ చేశామ‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఆయ‌న కోలుకుంటున్నార‌ని వైద్యులు తెలిపారు.

కాగా, త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో క‌మ‌ల‌హాస‌న్ గత కొన్ని నెల‌లుగా దీనిపైనే దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మొదలు పెట్టారు. త‌మ పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీపై ఆయ‌న ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారు.