కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్ దంపతుల పూజలు
- కాళేశ్వరంలో కేసీఆర్ పర్యటన
- రిజర్వాయర్‌ను పరిశీలించనున్న కేసీఆర్
- అనంతరం అధికారులతో సమీక్ష
అనంతరం లక్ష్మీ బరాజ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సాగునీటిని అందించడంపై అధికారులకు సూచనలు చేస్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న జలాలపై వివరాలు తెలుసుకుంటారు.
పంటలకు ఇబ్బందులు లేకుండా నీటిని అందించే అంశంపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన సూచనలు చేస్తారు. మధ్యాహ్నం లక్ష్మీ బరాజ్ వద్దే కేసీఆర్ భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు కాళేశ్వరం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.