గణతంత్ర వేడుకలకు అతిథి కాని అతిథి.. విద్యార్థినికి ప్రధాని అద్దాల గది నుంచి వేడుకలు చూసే అవకాశం

19-01-2021 Tue 11:25
  • సీబీఎస్ఈ రెండో ర్యాంకర్ దివ్యాంగి త్రిపాఠికి దక్కిన గౌరవం
  • మరికొందరు విద్యార్థులకూ అవకాశం
  • ప్రధానితో వేడుకలు చూడాలన్న కల తీరిందన్న దివ్యాంగి
Gorakhpur girl to see Republic Day parade from PMs box

గణతంత్ర వేడుకలకు సకల ఏర్పాట్లతో ఎర్రకోట ముస్తాబవుతోంది. ముఖ్య అతిథి లేకుండానే ఈ సారి వేడుకలు జరగబోతున్నాయి. అయితే, ఆ అతిథి స్థానంలో అరుదైన గౌరవం దక్కించుకుంది ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన విద్యార్థిని. ఆ అమ్మాయికి మరో ఘనత కూడా ఉందండోయ్. సీబీఎస్ఈ ఇంటర్ సెకండియర్ బయాలజీ గ్రూప్ లో దేశంలోనే రెండో ర్యాంకు సాధించింది.

ఆ అమ్మాయి పేరు దివ్యాంగి త్రిపాఠి. గణతంత్ర వేడుకలను ప్రధాని కూర్చుని చూసే ప్రత్యేకమైన అద్దాల గదిలో నుంచి వీక్షించేందుకు దివ్యాంగికి అవకాశం దక్కింది. ఆమెతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కొంతమంది విద్యార్థులకూ ఆ అవకాశం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి గణతంత్ర వేడుకులను చూడాలన్న కల తీరుతోందని దివ్యాంగి ఆనందం వ్యక్తం చేసింది. మోదీ అంటే తనకు చాలా ఇష్టమని, చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పింది. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో నీట్ కు సిద్ధమవుతున్నానని తెలిపింది.