వ‌రుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్ లను విడుద‌ల చేసిన రామ్ చ‌ర‌ణ్‌

19-01-2021 Tue 11:11
  • వ‌రుణ్ తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల‌
  • సినిమా పేరు గ‌నీ
  • బాక్సింగ్ నేప‌థ్యంలో సినిమా  
Ghani Motion Poster releases

మెగా హీరో వ‌రుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్ విడుదలయ్యాయి. వరుణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ ట్విట్ట‌ర్ ద్వారా ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశాడు. ఈ సినిమా పేరు 'గ‌నీ' అని ఆ సినీ యూనిట్ ప్ర‌క‌టించింది. బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ వ‌రుణ్ తేజ్ క‌న‌ప‌డుతున్నాడు. కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వరుణ్‌తేజ్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండ‌డం అల‌రిస్తోంది. ఆయ‌న స‌ర‌స‌న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ నటిస్తోంది.

ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న ఈ ‌ సినిమాను రెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌పై అల్లు వెంకటేశ్ తో పాటు సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.