హీరో విజయ్ దేవరకొండ పోస్ట‌రుకి బీరుతో అభిషేకం చేసిన ఫ్యాన్స్.. వీడియో ఇదిగో

19-01-2021 Tue 10:32
  • పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా
  • విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
  • ర‌చ్చ మొద‌లైందంటూ వీడియో పోస్ట్ చేసిన చార్మి
 the madness begins says charmi

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఓ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి వినూత్నంగా 'లైగర్' అని పేరు పెడుతూ విజ‌య్ దేవ‌రకొండ‌కు సంబంధించిన‌ ఫస్ట్ లుక్ ను నిన్న‌ విడుదల చేశారు. 'సాలా క్రాస్ బ్రీడ్స్‌'‌ అనే ఉప శీర్షిక కూడా పెట్టారు.

పూరీ, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి సినీ ప్ర‌ముఖుల నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో మాస్ ఆడియన్స్ దీనిపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. వారి ఫ్యాన్స్ అప్పుడే హ‌డావుడి కూడ మొదలు పెట్టేశారు. ఈ సినిమా టైటిల్, లుక్ ఫ్యాన్స్ లో నూత‌నోత్సాహం నింపిన‌ట్టుంది. అందుకే, వినూత్నంగా విజ‌య్ దేవ‌రకొండ లుక్ పోస్ట‌ర్ కు వారు బీరుతో అభిషేకం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను చార్మి పోస్ట్ చేసింది. రచ్చ మొదలైందని పేర్కొంది. సాధార‌ణంగా హీరోల పోస్ట‌ర్ ల‌కు అభిమానులు పాల‌తో అభిషేకం చేస్తుంటారు. విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరీ ఫ్యాన్స్ మాత్రం బీరు బాటిళ్ల‌తో కొత్త ట్రెండ్ కి ఆహ్వానం ప‌లుకుతుండ‌డం గ‌మ‌నార్హం.