బీహార్‌లో కరోనా టీకా తీసుకున్న ఇద్దరు ఏఎన్ఎంలకు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం

19-01-2021 Tue 09:55
  • బీహార్‌లో చురుగ్గా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్
  • చంపారన్ జిల్లాలో ఆరోగ్య కార్యకర్తలకు టీకా
  • కాసేపటికే ఇద్దరికి అస్వస్థత
Two ANMs health workers fell ill after taking vaccine

బీహార్‌లో కరోనా టీకా తీసుకున్న ఇద్దరు ఏఎన్ఎంలు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమ చంపారన్ జిల్లాలో నిన్న వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో టీకా తీసుకున్న వారిలో ఇద్దరు ఏఎన్ఎంలు అస్వస్థతకు గురి కావడంతో వారిలో ఒకరిని బెతియా ఆసుపత్రికి, మరొకరిని రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి  తరలించారు.

ప్రస్తుతం వారిద్దరికీ చికిత్స కొనసాగుతోందని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా కొనసాగుతోంది. టీకా తీసుకున్న వారిలో అక్కడక్కడ స్పల్ప దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. అయితే, అవి సహజమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.