Donald Trump: సంప్రదాయానికి ట్రంప్ స్వస్తి.. వీడ్కోలు లేఖ లేకుండానే వైట్‌హౌస్ నుంచి బయటకు!

Donald Trump leaves office without farewell letter
  • 1989లో రొనాల్డ్ రీగన్ నుంచి వస్తున్న సంప్రదాయం
  • ఒబామా నుంచి ట్రంప్‌కు వీడ్కోలు లేఖ
  • లేఖ లేకుండానే దిగిపోనున్న ట్రంప్
రేపటితో అధ్యక్ష పదవికి వీడ్కోలు పలకబోతున్న డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. 1989 నుంచి వస్తున్న వీడ్కోలు లేఖ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఎలాంటి లేఖ రాయకుండానే ట్రంప్ పదవి నుంచి దిగిపోనున్నారు. కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెబుతూ వీడ్కోలు లేఖ రాసే సంప్రదాయానికి రొనాల్డ్ రీగన్ శ్రీకారం చుట్టారు. 2017లో పదవి నుంచి దిగిపోవడానికి ముందు ఒబామా ట్రంప్‌నకు లేఖ రాశారు.

కానీ ఇప్పుడు జో బైడెన్ ఎన్నికనే గుర్తించని ట్రంప్ లేఖ రాసే అవకాశాలు కనిపించడం లేదు. విజయానికి కచ్చితమైన నమూనా ఏమీ ఉండదని, ఇక్కడందరూ తాత్కాలికంగా ఉండేవారేనని అప్పట్లో ట్రంప్‌కు రాసిన వీడ్కోలు లేఖలో ఒబామా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంస్థలు, సంప్రదాయాలకు రక్షకులుగా ఉండాలని ఒబామా తన లేఖలో పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ట్రంప్ మాత్రం ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టనున్నట్టు వార్తలు రావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Donald Trump
Joe Biden
Farewell Letter
America

More Telugu News