సీనియర్ ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్ సోదరుడు అనుమానాస్పద మృతి

18-01-2021 Mon 21:36
  • లవ్ అగర్వాల్ కుటుంబంలో విషాదం
  • యూపీలో అంకుర్ అగర్వాల్ మృతి
  • మృతదేహం పక్కనే పిస్టల్
  • మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు
Brother of IAS officer Luv Agarwal dies in suspicious circumstances

సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కుటుంబంలో విషాదం నెలకొంది. లవ్ అగర్వాల్ సోదరుడు అంకుర్ అగర్వాల్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ లో అంకుర్ మృతదేహం లభ్యమైంది.

సహరన్ పూర్ లోని పిల్కానీ ఏరియాలో ఓ ఫ్యాక్టరీ వద్ద అంకుర్ మృతదేహాన్ని గుర్తించారు. ఘటన స్థలంలో ఓ లైసెన్స్ డ్ పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో లవ్ అగర్వాల్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

లవ్, అంకుర్ ల తండ్రి కేజీ అగర్వాల్ సహరన్ పూర్ ప్రాంతంలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ గా పేరొందారు. ఇక లవ్ అగర్వాల్ 1996 బ్యాచ్ ఏపీ క్యాడర్ అధికారి. ఇటీవల కాలంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక లవ్ అగర్వాల్ నిత్యం మీడియా ముందుకు వచ్చి  కరోనా కేసులు వివరాలు వెల్లడిస్తుండడం తెలిసిందే.