ఏపీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రమోషన్

18-01-2021 Mon 21:02
  • ఇటీవలే తెలంగాణ నుంచి ఏపీ క్యాడర్ కు బదిలీ
  • పురపాలక శాఖ కార్యదర్శిగా విధులు
  • కార్యదర్శి నుంచి ముఖ్య కార్యదర్శిగా పదోన్నతి
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ఆదిత్యనాథ్
Senior IAS officer Srilakshmi gets promotion

ఇటీవలే తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ క్యాడర్ కు బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మికి పదోన్నతి లభించింది. ఆమెకు కార్యదర్శి హోదా నుంచి ముఖ్య  కార్యదర్శిగా ప్రమోషన్ లభించింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, శ్రీలక్ష్మి పై ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు ఉత్తర్వుల అమలు ఉంటుందని సీఎస్ తెలిపారు. ప్రస్తుతం శ్రీలక్ష్మి రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.