మన కుర్రాడు అదరగొడుతున్నాడు: సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసల జల్లు

18-01-2021 Mon 20:10
  • బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ కు 5 వికెట్లు
  • సిరాజ్ పై అభినందనల జల్లు
  • ట్వీట్ చేసిన కేటీఆర్
  • మీ నాన్న కచ్చితంగా గర్విస్తాడంటూ వ్యాఖ్యలు
Minister KTR heaps praise on Team India young fast bowler Mohammed Siraj

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ వికెట్ల వేట సాగించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అచ్చెరువొందారు. హైదరాబాదుకు చెందిన మన కుర్రాడు అదరగొడుతున్నాడంటూ కేటీఆర్ ప్రశంసించారు. తండ్రిని కోల్పోయిన విషాదకర పరిస్థితిలోనూ ఈ విధంగా రాణించడం మామూలు విషయం కాదని కొనియాడారు.

 "నీ అద్భుత ప్రదర్శన భారత జట్టు ముందర సిరీస్ గెలిచే అవకాశాన్ని నిలిపింది. మీ నాన్న పైనుంచి దీవెనలు అందజేస్తూ నీ ఆటతీరు పట్ల కచ్చితంగా గర్విస్తాడు" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ 19.5 ఓవర్లు విసిరి 73 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో తొలిసారి 5 వికెట్లు తీసిన సిరాజ్ పై పొగడ్తల వర్షం కురుస్తోంది.