ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. అనంతపురం జిల్లాలో సున్నా కేసులు!

18-01-2021 Mon 17:45
  • 24 గంటల్లో 81 కొత్త కేసుల నమోదు
  • కడప జిల్లాలో అత్యధికంగా 19 కేసులు
  • ప్రస్తుతం రాష్ట్రంలో 1,713 యాక్టివ్ కేసులు
AP registers 81 new Corona cases

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కేవలం 81 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అత్యధికంగా కడప జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 263 మంది కోలుకున్నారు. విశాఖ జిల్లాలో ఒక వ్యక్తి కరోనా వల్ల మృతి చెందాడు.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,86,066కి చేరింది. మొత్తం 7,141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 8,77,212 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 1,713 యాక్టివ్ కేసులు ఉన్నాయి.