చిరంజీవిని కలిసి ఆశీస్సులు అందుకున్న చిత్రపురి కాలనీ కొత్త కమిటీ సభ్యులు

18-01-2021 Mon 17:01
  • మెగాస్టార్ నివాసానికి వెళ్లిన చిత్రపురి కమిటీ సభ్యులు
  • ఆశీస్సులు అందుకున్న వైనం
  • పలు హామీలు ఇచ్చిన చిరంజీవి
  • చిరంజీవికి ధన్యవాదాలు తెలిపిన కాదంబరి కిరణ్ తదితరులు
Chitrapuri colony new committee members met Megastar Chiranjeevi

హైదరాబాదులోని చిత్రపురి కాలనీ కమిటీలో ఇటీవల కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. ఇవాళ నూతన కమిటీ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరంజీవిని కలిసినవారిలో కాలనీ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, కార్యదర్శి కాదంబరి కిరణ్, వినోద్ బాల, దీప్తి వాజ్ పేయి తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి తన వంతు సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. చిత్రపురి కాలనీ కొత్త కమిటీకి తన మద్దతు ఉంటుందని తెలిపారు. కాలనీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని భరోసా ఇచ్చారు. అంతేకాదు, చిత్రపురిలో అన్ని సౌకర్యాలతో కూడిన ఆసుపత్రి నిర్మాణానికి ప్రాజెక్ట్ రిపోర్టుతో వస్తే ఉపాసనతో మాట్లాడి సహకారం అందించే ఏర్పాట్లు చేస్తానని చిరంజీవి మాట ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్త కమిటీ కార్యవర్గం చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపింది.