ప్రివిలేజ్ కమిటీ ఎదుట కంటతడి పెట్టుకున్న రోజా

18-01-2021 Mon 16:32
  • ప్రొటోకాల్ ప్రకారం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన
  • ఎంత మందికి చెప్పుకున్నా వినిపించుకోలేదు
  • అధికారులు పట్టించుకోవడం లేదు
Roja feels emotional

ప్రత్యర్థి పార్టీల నేతలపై పదునైన వ్యాఖ్యలు చేస్తూ, వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే... వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. టీటీడీలో కూడా ఇదే పరిస్థితి ఉందంటూ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఎదుట విలపించారు. ఎంత మందికి చెప్పుకున్నా... పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు తనకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎదుట వాపోయారు.

తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో కూడా తనను పట్టించుకోవడం లేదని అన్నారు. తనకు తెలియకుండానే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.