నా కెరీర్ ను మలుపు తిప్పిన 'సింహాద్రి' చిత్రం ద్వారా దొరైస్వామిరాజుతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా: రాజమౌళి

18-01-2021 Mon 13:40
  • సీనియర్ నిర్మాత దొరస్వామిరాజు కన్నుమూత
  • ప్రగాఢ సంతాపం తెలిపిన రాజమౌళి
  • డిస్ట్రిబ్యూటర్ గా 1000కి పైగా చిత్రాలు రిలీజ్ చేశారని వెల్లడి
  • నిర్మాతగా ఆణిముత్యాల్లాంటి చిత్రాలు తీశారని కితాబు
Rajamouli condolences to the demise of Doraswami Raju

టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మాజీ శాసనసభ్యుడు వి.దొరస్వామిరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై అగ్రదర్శకుడు రాజమౌళి స్పందించారు. తన కెరీర్ ను మలుపు తిప్పిన 'సింహాద్రి' చిత్రం ద్వారా దొరస్వామిరాజు గారితో కలిసి పనిచేసే అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తానని రాజమౌళి పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నానని వివరించారు.

ఓ డిస్ట్రిబ్యూటర్ గా దొరస్వామిరాజు గారు 1000కి పైగా చిత్రాలను విడుదల చేశారని, ఓ నిర్మాతగానూ ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప తెలుగు చిత్రాలను నిర్మించారని కొనియాడారు. వీఎంసీ బ్యానర్ పై 'సీతారామయ్య గారి మనవరాలు', 'అన్నమయ్య' వంటి కొన్ని ఆణిముత్యాలను అందించారని రాజమౌళి పేర్కొన్నారు.