అయెధ్య‌ రామాల‌య నిర్మాణానికి విరాళాన్ని అందించిన హీరో అక్ష‌య్ కుమార్

18-01-2021 Mon 13:04
  • ఎంత విరాళాన్ని ఇచ్చాన‌న్న విషయాన్ని దాచిపెట్టిన అక్ష‌య్
  • ప్రజలంతా   విరాళాలివ్వాలని పిలుపు
  • ఆల‌య‌ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విన‌తి
akshay gives fund for ayodhya temple

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయెధ్య‌లో రామాల‌య నిర్మాణానికి విరాళాల సేక‌రణను ఇటీవ‌లే రామ జ‌న్మ‌భూమి ట్ర‌స్ట్, విశ్వ హిందూ ప‌రిష‌త్  ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో తానూ విరాళం ఇచ్చిన‌ట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ట్విట్ట‌ర్ లో వీడియో రూపంలో తెలిపాడు. అయితే, ఎంత విరాళాన్ని ఇచ్చాన‌న్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.  

దేశ ప్రజలంతా రామాలయ నిర్మాణానికి విరాళాలివ్వాలని ఆయ‌న కోరాడు. అయోధ్య రాముడి ఆల‌య‌ నిర్మాణంలో భాగస్వాములు కావాలని తెలిపాడు. చివ‌ర‌కు ‘జై శ్రీరాం’ అని నినదించాడు. కాగా, దాదాపు 40 నెలల్లో రామ మందిర నిర్మాణం పూర్త‌వుతుంది. దేశంలోని ప్ర‌తి హిందూ గ‌డ‌ప తొక్కి విరాళాలు సేక‌రించాల‌ని విశ్వ హిందూ ప‌రిష‌త్ భావిస్తోంది.