Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై పెద్ద పులి... పరుగులు పెట్టిన అధికారులు!

Tiger on Shamshabad Airport Runway
  • గత అర్ధరాత్రి కలకలం
  • పది నిమిషాలు రన్ వేపై గడిపిన వ్యాఘ్రం
  • ఆపై రషీద్ గూడ వైపు పయనం
హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై గత అర్థరాత్రి పెద్ద పులి కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు పది నిమిషాల పాటు రన్ వేపై పెద్దపులి తిరిగింది. ఆ సమయంలో టేకాఫ్, ల్యాండింగ్ కావాల్సిన విమానాలకు అనుమతి నిరాకరించిన అధికారులు, పులిని తరిమేందుకు పరుగులు పెట్టారు.

ఆపై పులి గోడ దూకి రషీద్ గూడ వైపు వెళ్లిపోయిందని గుర్తించిన అధికారులు, విషయాన్ని అటవీ శాఖకు తెలియజేశారు. తమ ప్రాంతానికి పెద్ద పులి వచ్చిందని తెలుసుకున్న రషీద్ గూడ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పులి ఎటువైపు వెళ్లిందన్న విషయాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్టు విమానాశ్రయ భద్రతా దళాలు వెల్లడించాయి.
Shamshabad
RGIA
Tiger

More Telugu News