Tamil: బిగ్ బాస్ తమిళ సీజన్ 4 విజేతగా నటుడు ఆరి అర్జున!

Tamil Biggboss Season 4 Winner Ari Arjuna
  • నిన్న రాత్రి గ్రాండ్ ఫినాలే
  • 105 రోజులు సాగిన బిగ్ బాస్
  • అర్జున గెలుస్తాడని ముందే ఊహాగానాలు
దాదాపు 105 రోజులుగా తమిళ బుల్లి తెర వీక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్-4 ముగిసింది. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో నటుడు ఆరి అర్జున విజయం సాధించినట్టు హోస్ట్ కమలహాసన్ ప్రకటించారు. ఆపై బిగ్ బాస్ ట్రోఫీని, రూ. 50 లక్షల నగదు బహుమతిని కమల్ అతనికి అందించారు. ఈ సీజన్ లో ఆరి అర్జునతో పాటు బాలాజీ మురుగదాస్, రమ్యా పాండ్యన్, సోమ్ శేఖర్, రియో రాజ్ లు టాప్ - 5 ఫైనలిస్టులుగా నిలిచారు.

అయితే, ఆది నుంచి అత్యధిక వీక్షకుల ఓట్లు ఆరి అర్జునకే వస్తుండటంతో, విజేతగా అతనే నిలుస్తాడని ముందు నుంచే ఊహాగానాలు ఉన్నాయి. హోస్ లోకి వెళ్లినప్పటి నుంచి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటూ, దాదాపు మూడున్నర నెలల పాటు అర్జున అందరినీ అలరించాడని గ్రాండ్ ఫినాలేలో కమలహాసన్ వ్యాఖ్యానించారు. అర్జున నిజాయతీ, పోరాట పటిమ తనను ఆకర్షించాయని తెలిపారు.

కాగా, హౌస్ లో అత్యధిక సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయిన కంటెస్టెంట్ గా ఉన్న అర్జున ప్రతిసారీ, ఫ్యాన్స్ ఓట్లతోనే గట్టెక్కుతూ రావడం గమనార్హం.
Tamil
Bigg Boss
Kamal Haasan
Ari Arjuna

More Telugu News