Woman: కాన్పు కోసం వస్తే గర్భమే రాలేదంటున్నారు... తిరుపతి ప్రసూతి ఆసుపత్రి వద్ద మహిళ వాగ్వాదం

  • సూళ్లూరుపేట నుంచి కాన్పు కోసం వచ్చిన మహిళ
  • ప్రసూతి ఆసుపత్రి వైద్యులతో వాగ్వాదం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన డాక్టర్లు
  • ఆమె కడుపులో గాలి బుడగలు ఉన్నాయని వెల్లడి
  • వాటినే ఆమె గర్భంగా భావించిందని వివరణ
Woman creates ruckus at Tirupati maternity hospital

తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద ఇవాళ డాక్టర్లకు, ఓ మహిళకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఓ మహిళ కాన్పు కోసం ప్రసూతి ఆసుపత్రికి వచ్చింది. అయితే తాను కాన్పు కోసం వస్తే గర్భమే రాలేదంటున్నారని వైద్యులపై ఆరోపణలు చేసింది. గర్భంలోని శిశువును మాయం చేసి బుకాయిస్తున్నారని మహిళ బంధువులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మహిళ ప్రవర్తనపై ప్రసూతి ఆసుపత్రి వైద్యులు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహిళకు వచ్చింది గర్భం కాదని, వైద్య పరీక్షలో గాలి బుడగలు ఉన్నట్టు నిర్ధారణ అయిందని వైద్యులు చెబుతున్నారు. కడుపులోని గాలి బుడగలను ఆ మహిళ గర్భంగా భావించిందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన అలిపిరి పోలీసులు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News