Ayyanna Patrudu: నామాలు పెట్టుకుని గోపూజలు చేస్తే కాదు... ఆ పాస్టర్ ను శిక్షిస్తేనే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు: సీఎం జగన్ కు అయ్యన్న హితవు

Former minister Ayyanna Patrudu demands punishment for pastor Pravin Chakravarthy
  • కాకినాడ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్ట్
  • ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదన్న అయ్యన్న
  • అతని వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్
  • వైసీపీ నేతలు ఎందుకు స్పందించడంలేదని ఆగ్రహం
కాకినాడకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్ ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు. అతని వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్ల విగ్రహాలను తానే  పగులగొట్టానని, కాలితో తన్నానని, మత మార్పిళ్లకు పాల్పడ్డానని పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చెప్పాడని అయ్యన్న తెలిపారు.

కానీ అతడిని అరెస్ట్ చేసి నాలుగు రోజులు అయినా ఇప్పటివరకు మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు. అతని వెనుక ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం దగ్గరి బంధువుల వివరాలు ఎప్పుడు మీడియాకు చెబుతున్నారు? అంటూ ప్రశ్నించారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరాచకాల గురించి వైసీపీలో ఒక్కరు కూడా ఎందుకు స్పందించడంలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నామాలు పెట్టుకుని గోపూజలు చేస్తే కాదు... ప్రవీణ్ చక్రవర్తి లాంటి వాడిని శిక్షిస్తేనే మీరు క్రిస్టియన్ అయినా హిందువుల పట్ల గౌరవం ఉందని మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు" అంటూ సీఎం జగన్ కు హితవు పలికారు. ముందు ఈ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాఫియాను బయటపెట్టాలని అయ్యన్న డిమాండ్ చేశారు.
Ayyanna Patrudu
Jagan
Pastor Pravin Chakravarthy
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News