నా తొలి ప్రాధాన్యత‌ టాలీవుడ్ కే: సోనూసూద్

17-01-2021 Sun 11:15
  • టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం
  • నా భార్య తెలుగు ప్రాంతానికి చెందిన మహిళ
  • తెలుగు కుటుంబంలో నేను ఒకడిని
i like tollywood says sonu sood

టాలీవుడ్ అంటే త‌న‌కు చాలా ఇష్టమని, త‌న‌ మొదటి ప్రాధాన్యత‌ తెలుగు పరిశ్రమకేనని సినీ న‌టుడు సోనూసూద్ అన్నాడు.  ‘అల్లుడు అదుర్స్‌’ సినిమా స‌క్సెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ... సినిమాకు సంబంధించిన చాలా విషయాలను తాను టాలీవుడ్ నుంచే నేర్చుకున్నానని తెలిపాడు. త‌న భార్య తెలుగు ప్రాంతానికి చెందిన మహిళ అని చెప్పాడు. దీంతో తాను తెలుగు కుటుంబంలో ఒకడినని తెలిపాడు.

బెల్లంకొండ సురేశ్ అంటే త‌న‌కెంతో అభిమానమ‌ని అన్నాడు. ఆయ‌న‌ ఏదైనా సినిమాలో పాత్ర ఉందని ఫోన్‌ చేస్తే వచ్చేస్తానని చెప్పాడు. ఆ సినిమాలోని పాత్ర, స్క్రిప్ట్‌ గురించి త‌న‌కు చెప్పాల్సిన అవసరమే లేదని అన్నాడు. ‘అల్లుడు అదుర్స్ సినిమాలో త‌న‌కు మంచి పాత్ర ఇచ్చినందుకు ఆయ‌నకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. అలాగే, బెల్లంకొండ‌ శ్రీనివాస్ మంచి మనసున్న వ్య‌క్త‌ని సోనూసూద్ ప్ర‌శంసించాడు. ఆయ‌న‌‌ బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానని చెప్పాడు.