Whats app: గూగుల్ సెర్చ్ లో కనిపిస్తున్న వాట్సాప్ వెబ్ యూజర్ల ఫోన్ నంబర్లు!

  • ఇప్పటికే ప్రైవరీ పాలసీ సమస్యలో వాట్సాప్
  • గూగుల్ సెర్చ్ లో కనిపిస్తున్న గ్రూప్ లు
  • తొలగించాలని కోరామన్న వాట్సాప్ యాజమాన్యం
Whats app Users Phone Numbers in Google Search

ఇప్పటికే పలు రకాల సమస్యల్లో ఇరుక్కుని ఉన్న వాట్సాప్ కు మరిన్ని సమస్యలు వచ్చేలా ఉన్నాయి. ప్రైవసీ పాలసీ విషయంలో సంస్థ తీసుకున్న నిర్ణయాలు యూజర్ల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోగా, ఇప్పుడు గూగుల్ సెర్చ్ లో వాట్సాప్ వెబ్ ను వాడుతున్న వారి ఫోన్ నంబర్లు కనిపిస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. గూగుల్ సెర్చ్ లో వాట్సాప్ గ్రూప్ లను సెర్చ్ చేసి, ఎవరైనా ఏ గ్రూప్ నైనా కనుక్కొని దానిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

ఈ విషయాన్ని వెల్లడించిన సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజారియా, వాట్సాప్ ఓ మొబైల్ అప్లికేషన్ అయినా, దాన్ని ల్యాప్ టాప్, పర్సనల్ కంప్యూటర్ల ద్వారానూ వినియోగించుకోవచ్చని వాట్సాప్ ను ల్యాప్ టాప్ లేదా పీసీ ద్వారా వాడే వారి వివరాలు మాత్రమే గూగుల్ సెర్చ్ లో కనిపిస్తున్నాయని అన్నారు. అది కూడా వ్యక్తిగత వాడకందారుల మొబైల్ నంబర్లు మాత్రమే కనిపిస్తున్నాయని, బిజినెస్ మెంబర్లు కనిపించడం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా రాజారియా పంచుకున్నారు. ఇది ప్రమాదకరమైన విషయమని ఆయన తెలిపారు.

కొన్ని రోజుల క్రితం గ్రూప్ చాట్ లింక్ లు గూగుల్ సెర్చ్ లో తనకు కనిపించాయని, గ్రూప్ పేరును సెర్చ్ చేస్తే, నంబర్లు కనిపిస్తున్నాయని, ఇది వ్యక్తిగత గోప్యతను నాశనం చేస్తోందని ఆయన అరోపించారు. ఈ విషయంలో వెంటనే గూగుల్ స్పందించి, గ్రూప్ చాట్ లింక్ లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై స్పందించిన వాట్సాప్, తాము ఇప్పటికే చాట్ లింక్ లను తమ సెర్చింజన్ కు జోడించరాదని గూగుల్ ను కోరామని పేర్కొనడం గమనార్హం.

More Telugu News