Narendra Modi: ఇవే మన అత్యాధునిక రైలు బోగీలు: ట్విట్టర్ లో నరేంద్ర మోదీ!

  • నేడు ప్రారంభించనున్న మోదీ
  • ప్రయాణికులకు నూతన అనుభూతి
  • మరిన్ని రైళ్లకు త్వరలోనే విస్టాడోమ్ కోచ్ లు
These are Our New Rail Coaches pics Showed by Modi

అహ్మదాబాద్ నుంచి కెవాడియా మధ్య నడిచే జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుకు నేటి నుంచి అత్యాధునిక విస్టా డోమ్ కోచ్ లను జోడించనుండగా, ఆ చిత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ప్రజలకు చూపించారు. ఈ ఉదయం ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్ విధానంలో మోదీ ప్రారంభించనున్నారు. ఈ కోచ్ లు ప్రయాణికులకు నూతన అనుభూతిని మిగుల్చుతాయని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. త్వరలోనే మరిన్ని రైళ్లకు ఇవే తరహా కోచ్ లను రైల్వే శాఖ అనుసంధానించనుందని మోదీ తెలిపారు.

కాగా, ఈ కోచ్ లు బయటి ప్రపంచాన్ని మరింతగా చూపిస్తాయి. రూఫ్ కూడా అధిక శాతం పారదర్శకంగా అద్దాలతో ఉంటుంది. ఈ రైలు గుజరాత్ లోని నర్మదా నదిపై నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మీదుగా సాగుతుందని గుర్తు చేసిన మోదీ, ఈ రైల్లో ప్రజలు ఇకపై మరింత ఆనందంగా ప్రయాణిస్తూ, అత్యద్భుత సర్దార్ పటేల్ విగ్రహ సందర్శనకు వెళ్లవచ్చని అన్నారు.

ఈ సరికొత్త విస్టాడోమ్ కోచ్ లను అనుసంధానించిన రైళ్ల జాబితాను సైతం మోదీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కెవాడియా - వారణాసి మహామన ఎక్స్ ప్రెస్, దాదర్ - కెవాడియా మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్, కెవాడియా - హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే బై వీక్లీ ఎక్స్ ప్రెస్, కెవాడియా - రేవా మధ్య తిరిగే వీక్లీ ఎక్స్ ప్రెస్, చెన్నై - కెవాడియా మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్, ప్రతాప్ నగర్ - కెవాడియా మధ్య నడిచే మెమూ ట్రయిన్ లకు వీటిని అమర్చనున్నట్టు తెలిపారు.

More Telugu News