సొంతూళ్ల నుంచి నగరాలకు... ప్రత్యేక రైళ్ల ఏర్పాటు!

17-01-2021 Sun 06:25
  • నిన్నటి నుంచే జాతీయ రహదారులపై రద్దీ
  • నేడు నర్సాపూర్, విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు
  • టికెట్ల ధరలను పెంచి అమ్ముతున్న ప్రైవేటు బస్సు యాజమాన్యాలు
Special Trains Today Between Telugu States

ఈ సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లిన వాళ్లంతా తిరిగి నగరాలకు చేరుకుంటున్నారు. నిన్నటి నుంచే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద భారీ రద్దీ కనిపించింది. ఇక నేడు అత్యధికులు హైదరాబాద్ కు వచ్చేందుకు నిర్ణయించుకోవడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది.

ఈ రోజు సాయంత్రం నర్సాపూర్, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల నుంచి స్పెషల్ రైళ్లు హైదరాబాద్ కు నడిపించనుంది.ఇక ప్రైవేటు ట్రావెల్స్ లో సైతం ప్రయాణాలకు డిమాండ్ అధికంగా ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ల ధరను అధికంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.