Sachin Tendulkar: అది పిచ్ మహిమ కాదు.. సిరాజ్ లో ఉన్న నైపుణ్యం: సచిన్ ప్రశంసలు

  • ఆసీస్ టూర్ లో రాణిస్తున్న మహ్మద్ సిరాజ్
  • బ్రిస్బేన్ టెస్టు తొలిరోజున స్వింగ్ బౌలింగ్ తో ఆకట్టుకున్న సిరాజ్
  • సిరాజ్ బౌలింగ్ ను విశ్లేషించిన సచిన్
  • సిరాజ్ బౌలింగ్ తీరుపై వీడియో రిలీజ్
Sachin Tendulker heaps praise on Team India young fast bowler Mohammed Siraj

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా సిరాజ్ స్వింగ్ బౌలింగ్ కు ఫిదా అయ్యాడు. పిచ్ పరిస్థితితో సంబంధం లేకుండా బంతిని రెండు వైపులా నాట్యం చేయిస్తున్నాడంటూ ఈ హైదరాబాదీ పేసర్ ను సచిన్ ప్రశంసించాడు. అంతేకాదు, సిరాజ్ ప్రతిభను అందరికీ వివరించేందుకు ఈ లెజెండరీ బ్యాట్స్ మన్ ఏకంగా ఓ వీడియోనే రూపొందించాడు.

అందులో సిరాజ్ బంతిని పట్టుకునే తీరు, అవుట్ స్వింగర్ వేసేటప్పుడు సీమ్ ను రిలీజ్ చేసే తీరు, ఇన్ స్వింగర్ వేసేటప్పుడు బంతిని ఎలా గింగిరాలు తిప్పుతాడో వివరంగా తెలిపాడు. బ్రిస్బేన్ టెస్టు తొలిరోజున ఆసీస్ బ్యాట్స్ మెన్ సిరాజ్ స్వింగ్ కు ఎలా ఇబ్బంది పడ్డారో సచిన్ వివరించాడు. బ్రిస్బేన్ లో నిన్న  సిరాజ్ విసిరిన బంతులు అవుట్ స్వింగర్లు, ఇన్ కట్టర్లుగా దూసుకెళ్లాయంటే అది పిచ్ పై ఉన్న పగుళ్ల వల్ల కానేకాదని ఈ మాస్టర్ బ్లాస్టర్ స్పష్టం చేశాడు. అది సిరాజ్ ప్రతిభ వల్లేనని ఉద్ఘాటించాడు.

More Telugu News