Ashok Gajapathi Raju: రామతీర్థంలో కొత్త విగ్రహాల తయారీకి నేనిచ్చిన నగదును ప్రభుత్వం తిరస్కరించింది: అశోక్ గజపతిరాజు

Ashok Gajapathi Raju says his donation was rejected by government
  • రామతీర్థం ఆలయంలో ఇటీవల విగ్రహం ధ్వంసం
  • కొత్తగా విగ్రహాలు చేయిస్తున్న దేవాదాయ శాఖ
  • టీటీడీ ఆధ్వర్యంలో సీతారాముల విగ్రహాల తయారీ
  • నగదు కానుకలు తిరస్కరిస్తున్నట్టు దేవాదాయ శాఖ వెల్లడి
ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో, ఇక్కడ కొత్తగా సీతారాముల విగ్రహాలను ప్రభుత్వం తయారుచేయిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఈ విగ్రహాల తయారీ జరుగుతోంది. అయితే, ఈ విగ్రహాల తయారీ కోసం వస్తున్న నగదు కానుకలను తిరస్కరిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయశాఖ వెల్లడించింది.

దీనిపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు స్పందించారు. కొత్త విగ్రహాల తయారీకి తాను ఇచ్చిన నగదు కానుకలను తిరస్కరించారని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించి రామతీర్థం అనువంశిక ధర్మకర్తగా తనను తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థాపక కుటుంబాన్ని ఆలయానికి దూరం చేసే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.
Ashok Gajapathi Raju
Idols
Ramatheertham
Andhra Pradesh

More Telugu News