ప్రవీణ్ చక్రవర్తి చాలా గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చుతున్నాడు: వర్ల రామయ్య ఆరోపణలు

16-01-2021 Sat 15:55
  • సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో ప్రవీణ్ చక్రవరి అరెస్ట్
  • కాకినాడలో పాస్టర్ గా వ్యవహరిస్తున్న ప్రవీణ్ చక్రవర్తి
  • ప్రవీణ్.. బ్రదర్ అనిల్ తో కలిసి పనిచేశాడంటున్న వర్ల
  • గత ఎన్నికల్లో ఓ పార్టీకి ప్రచారం చేశాడని ఆరోపణలు
TDP leader Varla Ramaiah comments on pastor Pravin Chakravarthi arrest

ఓ మతాన్ని రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో  వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు.

ప్రవీణ్ చక్రవర్తి... బ్రదర్ అనిల్ బృందంతో కలిసి పనిచేశారని, చాలా గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చుతున్నాడని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీకి ప్రచారం కూడా చేశాడని తెలిపారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడింది తానేనని ప్రవీణ్ ప్రకటించారని అన్నారు. కానీ, ఎవరికో మేలు చేయడం కోసం డీజీపీ సగౌరవంగా వ్యవహరించడం లేదని వర్ల రామయ్య విమర్శించారు.

ఈ ఘటనల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని, గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన వారిని అరెస్ట్ చేశారని... కానీ హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన బూతుల మంత్రిని మాత్రం అరెస్ట్ చేయడంలేదని వ్యాఖ్యానించారు.