ఈ ఫొటోలో ఒక వ్యక్తి మరింత యంగ్ గా మారిపోతున్నాడు: మహేశ్ బాబుపై మంచు విష్ణు వ్యాఖ్యలు

16-01-2021 Sat 14:49
  • ఆసక్తికర ఫొటో పంచుకున్న మంచు విష్ణు
  • హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న మహేశ్ బాబు
  • ప్రశంసల జల్లు కురిపించిన విష్ణు
  •  మహేశ్ మంచి మనసే అంత అందానికి కారణమని వెల్లడి
  • కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్
Manchu Vishnu shares cute pic of Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి మరో హీరో మంచు విష్ణు స్పందించారు. తాము కలిసున్న ఓ ఫొటోను పంచుకున్న మంచు విష్ణు... మహేశ్ బాబుపై పొగడ్తల జల్లు కురిపించారు. కాగా ఆ ఫొటోలో మంచు విష్ణు, వెరానికా, మహేశ్ బాబు, నమ్రత ఉన్నారు. ఈ ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన విష్ణు... ఈ ఫొటోలో ఒక వ్యక్తి రోజురోజుకు అందంగా తయారవుతున్నాడని, మరింత కుర్రాడిగా మారిపోతున్నాడని వ్యాఖ్యానించారు.

అయితే, అతనంత యంగ్ గా కనిపించడానికి అతడి మంచి మనసు, సత్ప్రవర్తనే కారణమని బలంగా నమ్ముతున్నానని వివరించారు. విష్ణు వ్యాఖ్యలపై మహేశ్ బాబు స్పందించారు. గత రాత్రి అద్భుతంగా గడిచిందని, తమకు ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చారంటూ మంచు విష్ణు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.