Sidharth: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో తెరపైకి మరో వ్యక్తి!

Police identifies another person in Bowenpally kidnap case
  • కిడ్నాప్ వ్యవహారంలో సిద్ధార్థ అనే వ్యక్తి పాత్రను గుర్తించిన పోలీసులు!
  • సిద్ధార్థ స్వస్థలం విజయవాడ
  • గతంలో అఖిలప్రియ దంపతులకు బౌన్సర్ గా వ్యవహరించిన వైనం
  • భార్గవరామ్ సూచనలతో కిడ్నాప్ కు మనుషుల సరఫరా
  • నకిలీ ఐటీ దాడుల్లో పాల్గొన్న సిద్ధార్థ ముఠా
హఫీజ్ పేట భూవివాదంలో బోయిన్ పల్లి వద్ద జరిగిన కిడ్నాప్ ఘటనలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆమె భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ కిడ్నాప్ ఘటనలో భార్గవరామ్ కు మనుషులను సరఫరా చేసింది సిద్ధార్థ అనే వ్యక్తి అని వెల్లడైంది. విజయవాడకు చెందిన సిద్ధార్థ గతంలో అఖిలప్రియ, భార్గవరామ్ లకు బౌన్సర్ గా వ్యక్తిగత రక్షణ బాధ్యతలు నిర్వర్తించినట్టు తెలిసింది.

కిడ్నాప్ కు పథక రచన చేసిన తర్వాత భార్గవరామ్ సూచనల మేరకు సిద్ధార్థ 15 మందిని విజయవాడ నుంచి హైదరాబాదుకు తరలించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ మనుషుల సాయంతోనే ప్రవీణ్ రావు సోదరుల నివాసాల్లో నకిలీ ఐటీ దాడులు నిర్వహించారు. కిడ్నాప్ ఘటన తర్వాత సిద్ధార్థ ముఠా సభ్యులు గోవా పారిపోగా, కొందరిని పోలీసులు పట్టుకున్నారు. సిద్ధార్థను కూడా గోవాలోనే అదుపులోకి తీసుకున్నారు.
Sidharth
Bowenpally Kidnap
Bhuma Akhila Priya
Bhargavaram
Vijayawada

More Telugu News