UAE: యూఏఈలో మరో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ గుర్తింపు!

  • యూకే స్ట్రెయిన్ కేసులను పరిశీలిస్తున్న క్రమంలో సరికొత్త స్ట్రెయిన్ గుర్తింపు
  • సాధారణ కరోనా కంటే వేగంగా విస్తరిస్తున్న స్ట్రెయిన్
  • ప్రస్తుత చికిత్స, టీకా పద్ధతిని కొనసాగిస్తే సరిపోతుందన్న వైద్య నిపుణులు
New strain found in UAE

ఓవైపు కరోనా వైరస్ నుంచి ఇంకా కోలుకోకముందే... దాన్నుంచి పుట్టుకొస్తున్న కొత్త స్ట్రెయిన్ లు ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయి. యూకే, సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ లు కలకలం సృష్టిస్తున్నాయి. యూకే స్ట్రెయిన్ ప్రపంచంలోని అనేక దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలో మరో కలవరపరిచే వార్త వెలుగులోకి వచ్చింది. యూఏఈలో సైతం మరో రకం కొత్త స్ట్రెయిన్ ను గుర్తించారు.

యూకే స్ట్రెయిన్ కేసులను పరిశీలిస్తున్న క్రమంలోనే మరికొన్ని జన్యుమార్పిడిలతో ఈ కొత్తరకం వైరస్ వెలుగులోకి వచ్చిందని యూఏఈ వైద్య నిపుణులు తెలిపారు. కొత్త స్ట్రెయిన్ కు ప్రస్తుత కరోనా పేషెంట్లకు కొనసాగిస్తున్న చికిత్స, టీకా పద్ధతినే కొనసాగిస్తే సరిపోతుందని యూఏఈ నేషనల్ కోవిడ్-19 క్లినికల్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్ పర్సన్ డాక్టర్ నవల్ అల్ కాబి తెలిపారు. అయితే మామూలు కరోనా వైరస్ తో పోలిస్తే ఈ కొత్త స్ట్రెయిన్ విస్తరణ వేగంగా ఉందని చెప్పారు.

More Telugu News