కృష్ణా జిల్లాలో నటుడు విశాల్ సందడి.. కోడి పందేల వీక్షణ

16-01-2021 Sat 10:04
  • గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు ఆలయంలో ప్రత్యేక పూజలు
  • మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డితో కలిసి కోడి పందేలను వీక్షించిన నటుడు
  • విశాల్‌ను చూసేందుకు ఎగబడిన జనం
kollywood hero vishal in Krishna dist gudlavalleru

సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో నిర్వహించిన కోడి పందాల్లో కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్ సందడి చేశాడు. గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రులోని శ్రీ భూ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశాడు. మేఘా సంస్థ ఎండీ, ఆలయ నిర్మాత పీవీ కృష్ణారెడ్డితో కలిసి స్వామివారి దైనందిని, కాలమానిని ఆవిష్కరించాడు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కోడి పందాలను అందరూ కలిసి తిలకించారు. విశాల్ వచ్చిన విషయం తెలిసిన అభిమానులు, స్థానికులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.