ఆసీస్ 369 పరుగులకు ఆలౌట్

16-01-2021 Sat 08:33
  • ఓవర్ నైట్ స్కోరుకు 95 పరుగులు జోడించిన ఆసీస్
  • మూడేసి వికెట్లు తీసుకున్న నటరాజన్, ఠాకూర్, సుందర్
  • సెంచరీతో మెరిసిన లబుషేన్
australia all out for 369 runs in first innings

బ్రిస్బేన్‌లో భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయింది. 274/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 95 పరుగులు మాత్రమే జోడించి చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. కొత్త కుర్రాళ్లు శార్దూల్ ఠాకూర్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్‌లు బంతితో రెచ్చిపోయారు.

ప్రమాదకర భాగస్వామ్యాలను విడదీస్తూ ఆసీస్ జోరుకు అడ్డుకట్ట వేశారు.  ముగ్గురూ చెరో మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఆసీస్ ఆటగాళ్లలో లబుషేన్ మరోమారు మెరిశాడు. 108 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. వేడ్ 45, గ్రీన్ 47, కెప్టెన్ టిమ్ పైన్ 50 పరుగులు చేశారు.