డీజీపీపై టీడీపీ, బీజేపీ నేతల ఎదురుదాడి గర్హనీయం: ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు

16-01-2021 Sat 07:40
  • నిజాయతీగా పనిచేస్తున్న డీజీపీపై నిందలా?
  • వాస్తవాలను నిష్పక్షపాతంగా ప్రజల ముందు ఉంచుతున్నాం
  • కార్యకర్తలను సరిచేసుకోకుండా ఇదేం పని
It is not correct to verbal attack on police Janakula Srinivasarao

పోలీసులపై టీడీపీ, బీజేపీ నేతల ఎదురుదాడి సరికాదని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం (ఏపీపీఓఏ) రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న దాడుల కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో వెల్లడైన వాస్తవాలను ప్రజల ఎదుట ఉంచుతున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో వారిపై ఎదురుదాడి సరికాదన్నారు. డీజీపీ గౌతం సవాంగ్, పోలీసులపై తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు విచారకరమన్నారు. కార్యకర్తలను సరిచేసుకోకుండా, నిజాయతీగా వ్యవహరిస్తున్న డీజీపీపై నిందలు సరికావని శ్రీనివాసరావు అన్నారు.