కొవిడ్ అంతానికి ఇది ఆరంభం: కేంద్రమంత్రి హర్షవర్ధన్ 

16-01-2021 Sat 07:17
  • పదిన్నర గంటలకు మోదీ చేతుల మీదుగా వ్యాక్సినేషన్ ప్రారంభం
  • దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ
  • సందేహాల నివృత్తి కోసం 1075 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు
This is the beginning of end of covid says union minister

మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా టీకా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం పదిన్నర గంటలకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. టీకా పంపిణీ ప్రక్రియలో తలెత్తే సందేహాల నివృత్తి కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1075 టోల్‌ ఫ్రీ నంబరును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అలాగే, కొవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ నిల్వలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. వ్యాక్సినేషన్ ఏర్పాట్లను నిన్న పరిశీలించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అనంతరం మాట్లాడుతూ.. కొవిడ్ అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమని అన్నారు.