గోమాతలతో పవన్ కల్యాణ్ కనుమ వేడుకలు... ఫొటోలు ఇవిగో!

15-01-2021 Fri 19:07
  • ఇవాళ కనుమ
  • తన వ్యవసాయక్షేత్రానికి వెళ్లిన పవన్
  • గోమాతలకు ఫలాలు, ఇతర ఆహారం సమర్పణ
  • పశువులు, పక్షుల సంరక్షణ కోసం సిబ్బందికి సూచనలు
Pawan Kalyan Kanuma celebrations at his farm house

ఇవాళ కనుమ పండుగను పురస్కరించుకుని జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాదు శివార్లలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడి గోశాలలోని గోమాతలతో కనుమ వేడుకలు నిర్వహించారు. పవన్ రాక సందర్భంగా గోవులను అక్కడి సిబ్బంది చక్కగా అలంకరించారు. ఆపై పవన్ ఆ గోవులకు నమస్కరించి వాటికి పండ్లు, ఇతర ఆహారం అందించారు. గోమాతలు ఆహారం స్వీకరించడాన్ని ఆయన ఆసక్తిగా తిలకించారు. వాటిని ఆప్యాయంగా నిమురుతూ జంతుప్రేమను చాటుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ తన వ్యవసాయ క్షేత్ర సిబ్బందికి పలు సూచనలు చేశారు. పశు సంపద కోసం తీసుకునే చర్యలతో పాటే, వ్యవసాయక్షేత్రంలో చేరే పక్షుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు కూడా కల్పించాలని స్పష్టం చేశారు.