అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ నాయిక

15-01-2021 Fri 18:05
  • ప్రస్తుతం 'పుష్ప'లో నటిస్తున్న అల్లు అర్జున్ 
  • కొరటాల దర్శకత్వంలో తదుపరి సినిమా 
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ ఎంపిక  
  • ఇప్పటికే 'మేజర్' సినిమాలో సయీ మంజ్రేకర్   
Sai Manjrekar in Allu Arjuns movie

పూర్వం మన హీరోలు ఒక హీరోయిన్ తో వరుసగా కొన్ని సినిమాలు చేసేవారు. అయితే, గత కొంతకాలంగా ట్రెండ్ మారింది. ఒక సినిమాలో నటించిన కథానాయికను మళ్లీ ఆ వెంటనే మన హీరోలు తీసుకోరు. ప్రేక్షకులకి తన జోడీ వెరైటీగా కనిపించడం కోసం ఎప్పటికప్పుడు హీరోయిన్లను మారుస్తుంటారు.

ఇక విషయంలోకి వస్తే, అల్లు అర్జున్ కొత్త సినిమాలో కథానాయికగా బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ దీని తర్వాత తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు.

ఈ సినిమాలో కథానాయికగా సయీ మంజ్రేకర్ నటించనున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. గతంలో 'దబాంగ్ 3'లో సల్మాన్ సరసన నటించి, చిత్రరంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో 'మేజర్' సినిమాలో నటిస్తోంది.