Corona Virus: భారత్ లో మరింత తగ్గిన కరోనా కేసుల సంఖ్య

  • గత 24 గంటల్లో 15,590 కొత్త కేసుల నమోదు
  • 1,05,27,683కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • రేపటి నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ
15590 fresh COVID 19 Cases Reported In India

మన దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఒకానొక సమయంలో రోజుకు లక్ష వరకు కేసులు నమోదైన పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. అయితే క్రమంగా పరిస్థితిలో మార్పు వచ్చింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,590 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,05,27,683కి చేరుకుంది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటి వరకు 4,976 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 7 కేసులు బయటపడ్డాయి.

మరోవైపు రేపటి నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. దేశ వ్యాప్తంగా రేపు దాదాపు 3 లక్షల మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయనున్నారు. గర్భిణి స్త్రీలకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ వేయడం లేదు. తొలి డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన 14 రోజుల తర్వాత మరో డోస్ ఇవ్వనున్నారు. మన దేశంలో రెండు వ్యాక్సిన్ లను వేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తొలి డోస్ ఏ వ్యాక్సిన్ తీసుకుంటారో... రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. తొలి విడతలో ఒక కంపెనీ వ్యాక్సిన్, రెండో విడతలో మరో కంపెనీ వ్యాక్సిన్ ఇవ్వడం జరగదు.

More Telugu News