పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' టీజర్ వచ్చేసింది!

14-01-2021 Thu 18:33
  • పవన్, శ్రుతిహాసన్ జంటగా 'వకీల్ సాబ్'
  • కీలకపాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల
  • సంక్రాంతి కానుకగా టీజర్ విడుదల
  • తనదైన శైలిలో అలరించిన పవన్
Teaser from Pawan Kalyan Vakeel Saab

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. పవన్ అభిమానులను అలరించేందుకు సంక్రాంతి కానుకగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ ఇంట్రడక్షన్ సీన్లతో పాటు పలు సన్నివేశాలను పొందుపరిచారు.

"అబ్జెక్షన్ యువరానర్" అంటూ కోర్టు హాల్లో తన వాగ్ధాటిని ప్రదర్శించడమే కాకుండా, "కోర్టులో వాదించడమే కాదు, కోటు తీసి కొట్టడం కూడా వచ్చు" అంటూ రౌడీలను ఉతికారేయడం ఈ టీజర్ లో చూడొచ్చు.

దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. తమన్ సంగీతం అందించాడు. ఇందులో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.