ఏపీ కరోనా అప్ డేట్: 179 కొత్త కేసులు, 4 మరణాలు

14-01-2021 Thu 17:37
  • గత 24 గంటల్లో 41,671 కరోనా టెస్టులు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 51 కేసులు
  • అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 2 కేసులు
  • ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,338
Covid numbers downs in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 41,671 కరోనా పరీక్షలు నిర్వహించగా, 179 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 51 కొత్త కేసులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో 26, తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 2, కడప జిల్లాలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 219 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,85,616 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,76,140 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,338 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,138కి చేరింది.