వెంకటేశ్ 'నారప్ప' నుంచి పోస్టర్ వచ్చింది!

  • తమిళ హిట్ చిత్రం అసురన్ రీమేక్ గా 'నారప్ప'
  • వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం
  • కుటుంబ సభ్యులతో నారప్ప ఫొటోతో పోస్టర్  
  • వచ్చే వేసవిలో థియేటర్లలో సినిమా విడుదల  
Venkatesh Narappa poster out today

సీనియర్ నటుడు విక్టరీ వెంకటేశ్ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ.. తన వయసుకు తగ్గా పాత్రలు పోషిస్తూ తన కెరీర్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఆమధ్య 'ఎఫ్2' వంటి చిత్రంలో నటించి, మంచి విజయాన్ని అందుకున్న వెంకీ నటిస్తున్న తాజా చిత్రం 'నారప్ప'. తమిళంలో వచ్చిన 'అసురన్' హిట్ చిత్రానికి రీమేక్ గా ఇది రూపొందుతోంది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని కొత్త పోస్టర్ ని ఈ రోజు సంక్రాంతి సందర్భంగా అభిమానుల కోసం రిలీజ్ చేశారు. వెంకటేశ్ రైతు గెటప్పులో పొలంలో తన కుటుంబ సభ్యులతో కూర్చుని.. ఆనందంగా గడుపుతున్న క్షణాలకు సంబంధించిన ఫొటోతో కూడిన ఈ పోస్టర్ ఆకట్టుకునేలా వుంది.

ఇక వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు కూడా అందులో పేర్కొన్నారు. ఇందులో ప్రియమణి కథానాయికగా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎక్కువ భాగం షూటింగ్ అనంతపురం జిల్లాలో జరిగింది.

More Telugu News